Friday, July 30, 2021

భారీగా పెరిగిన బంగారం ధ‌ర‌లు…మ‌హిళ‌ల‌కు భయం పుట్టిస్తున్న బంగారం

Must Read

బంగారం ధరలు మళ్ళీ పెరుగుతున్నాయి. క‌రోనా త‌రువాత ఆర్ధిక రంగం క్ర‌మంగా పుంజుకుంటోంది. సాధార‌ణ ప‌రిస్థితులు ఇప్పుడిప్పుడే నెల‌కొంటున్నాయి. క‌రోనా కార‌ణంగా మూత‌ప‌డిన అనేక రంగాలు తిరిగి తెరుచుకుంటున్నాయి. గ‌తంలో పుత్త‌డిపై పెట్టుబ‌డులు పెట్టిన ముదుప‌రులు, బంగారంలో పాటుగా ఇత‌ర రంగాల‌పై కూడా దృష్టి సారిస్తున్నారు.

బంగారంపై పెట్టుబ‌డులు పెరుగుతుండ‌టంతో వాటి ధ‌ర‌లు పెరుగుతున్నాయి. అటు అంత‌ర్జాతీయంగా కూడా పుత్త‌డిపై ముదుప‌రులు అధిక మొత్తంలో పెట్టుబ‌డులు పెడుతున్నారు. ఈ రోజు హైద‌రాబాద్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 110 పెరిగి 44,310కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.120 పెరిగి రూ.48,340కి చేరింది. ఇక బంగారంతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా పెరిగాయి. కిలో వెండి ధ‌ర రూ.1000 పెరిగి రూ. 74,900కి చేరింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This