Tuesday, July 27, 2021

100 రూపాయ‌ల ఇవ్వలేదని మాజీ వైస్‌ చాన్సలర్‌ కు దారుణంగా హత్య చేసిన యువకులు

Must Read

జార్సుగూడకు చెందిన ‍ప్రొఫెసర్‌ ధూర్బరాజ్‌ నాయక్‌ సంబల్పూర్‌ యునివర్సిటీలో వైస్‌ చాన్సలర్‌గా పనిచేసి రిటైర్‌ అయ్యారు. కాగా జూన్ 27 ఆదివారం ఊళ్లో నుంచి కొంతమంది యువకులు వచ్చి నాయక్‌ ఇంట్లోకి చొరబడ్డారు. పనిమీద బయటకు వెళ్లిన నాయక్‌ అంతలోనే ఇంటికి వచ్చారు… నాయక్‌ను చూసిన ఆ యువకులు డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. అందుకు అతను ఒప్పుకోకపోవడంతో కనీసం వంద రూపాయలైనా ఇవ్వాలంటూ అతనిపై దౌర్జన్యం చేశారు.

వంద రూపాయలు అడిగితే ఇవ్వలేదని మాజీ వైస్‌ చాన్సలర్‌ను దారుణంగా హత్య చేసిన ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. పట్టపగలు అధికారి ఇంట్లో చొరబడ్డ దుండగులు అతన్ని దారుణంగా హతమార్చారు. కుటుంబీకులు ఆయన్ను ఆసుపత్రికి తరలించిన కాసేపటకే తుదిశ్వాస విడిచారు. కాగా ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నట్లు జార్సుగూడ ఎస్పీ బీసీ దాస్ తెలిపారు.

ఈ క్రమంలోనే నాయక్‌, ఆ యువకులు మధ్య తోపులాట జరిగింది. ఆ యువకుల్లో ఒక వ్యక్తి అక్కడే ఉన్న గొడ్డలిని తీసుకొని నాయక్‌ మెడపై నరికాడు. దీంతో నాయక్‌ అక్కడే కుప్పకూలిపోయారు. దుండగులు అక్కడినుంచి పారిపోయారు. కుటుంబీకులు హుటాహుటినా ఆయన్ను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. అప్పటికే నాయక్ మరణించారు. కేవ‌లం 100 రూపాయ‌ల కోసం ఒక మాజీ చాన్సుల‌ర్‌ను దారుణంగా చ‌ప్ప‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This