Tuesday, July 27, 2021

మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ భార్య శారదక్క కరోనా మృతి..భర్త చనిపోయిన కొద్దీ రోజులకే

Must Read

మావోయిస్టు శారదక్క కరోనాతో మృతి చెందారు. మావోయిస్టు హరిభూషణ్‌ భార్య, మావోయిస్టు పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారదక్క మృతి చెందినట్లు సమాచారం ఉందని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తెలిపారు. ఈ నెల 24న ఆమె కరోనాతో ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోందన్నారు. మావోయిస్టు చర్ల, శబరి ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన శారద డీసీఎంగా ఉన్నతి పొందారు. ఈ విషయంతో మడగూడెం గ్రామంతో పాటు, తల్లిగారి ఊరైనా గంగారాం విషాదంలో మునిగాయి.

మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం మడగూడెం గ్రామానికి చెందిన హరిభూషణ్ మరిణించిన నాలుగు రోజులకే ఆమె మృతి చెందినట్లు భావిస్తున్నారు. కరోనా మహమ్మారి శారదను కుంగదీసినట్లుగా తెలుస్తోంది. శారద గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారముందని మహబూబాబాద్‌ ఎస్పీ కోటిరెడ్డి వెల్లడించారు. ఇప్పటికైనా మావోయిస్టులు పాత సిద్ధాంతాలను పక్కనబెట్టి కరోనా బారిన పడకుండా మావోయిస్టులు లొంగిపోవాలని ఆయన కోరారు. పోలీస్‌ శాఖ తరఫున మెరుగైన వైద్య సేవలు అందిస్తామన్నారు.
Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This