Saturday, June 19, 2021

లేడీ టీచర్ నిర్వాకం..! స్టూడెంట్ తో ప్రేమ! చివరికి?

Must Read

కరోనా వైరస్ కారణంగా పిల్లలు సరిగ్గా పుస్తకాలు పట్టుకుని రెండేళ్ళు అయిపోతుంది. స్కూళ్లు మూతపడటంతో పాఠాలన్నీ ఆన్‌లైన్‌లో జరుగుతున్నాయి. అయితే తమ పిల్లలు చదువులో వెనకబడుతున్నారని అనుకుంటున్న కొందరు తల్లిదండ్రులు ట్యూషన్ టీచర్లను నియమించుకుని చదువు చెప్పిస్తున్నారు. అయితే ఇలా చేయడమే ఓ తల్లిదండ్రుల కొంప ముంచింది. విద్యార్థికి చదువు చెప్పాల్సిన ట్యూషన్ టీచర్ అతడికి ప్రేమ పాఠాలు వల్లించి తనతో తీసుకుపోయింది. ఈ ఘటన హర్యానాలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..

పానిపట్ కు చెందిన దంపతుల కుమారుడు తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. వచ్చే ఏడాది టెన్త్ కావడంతో చదువు గాడి తప్పుతుందని 20ఏళ్ల లేడీ టీచర్ ను ట్యూషన్ కు పెట్టారు. ఆమె రోజూ ఇంటికి వచ్చి 4 గంటలు పాఠాలు చెప్పాలని ఒప్పందం కుదిరింది. కానీ.. ఆ లేడీ టీచర్ నాలుగు నెలల నుంచి బాలుడికి ప్రేమ పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది.

ట్యూషన్ టీచర్ ఇంటికి వెళ్లొస్తానని చెప్పిన కుమారుడు రాత్రయినా ఇంటికి రాకపోవడంతో కంగారుపడ్డ పేరెంట్స్ ఆమె ఇంటికి వెళ్లారు. ఇద్దరూ కనిపించలేదు. వెంటనే పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు టీచర్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేసి గాలిస్తున్నారు. ఆమెకు గతంలోనే పెళ్లికాగా కొద్దిరోజులకే విడాకులు తీసుకుని పుట్టింట్లో ఉంటోంది. ఈ క్రమంలోనే ప్రేమ పేరుతో బాలుడిని తీసుకెళ్లిపోయిందని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This