Saturday, June 19, 2021

అమ్మాయి వేషంలో ప్రియురాలి పెళ్లికి వెళ్లిన ప్రియుడు.. చివరికి దొరికిపోయి ఇలా..!

Must Read

ప్రేమ కోసం చాలా మంది అనేక కష్టాలు పడుతుంటారు. ప్రేమలో పడ్డవారు ఒకరికొకరు దూరంగా ఉండాలంటే నరకంగా భావిస్తారు. ప్రేమ కోసం కొందరు అడ్డదారులు తొక్కుతుంటారు. ఇక్కడ మాత్రం ఓ ప్రేమికుడు తన ప్రియురాలిని కలుసుకునేందుకు వెరైటీ ప్లాన్‌ వేశాడు. ఉత్తరప్రదేశ్‌లోని భడోహి జిల్లాకు చెందిన యువతీయువకులు ప్రేమించుకున్నారు. కానీ, విషయం అమ్మాయి ఇంట్లో వారికి తెలియటంతో వీరిని దూరంగా పెట్టారు. దీంతో సదరు ప్రేమికుడు ప్రియురాలికి దూరంగా ఉండలేకపోయాడు. ఎలాగైనా తన ప్రేయసిని కలుసుకోవాలనుకున్నాడు.

అక్కడ ఓ అమ్మాయి పెళ్లి జరుగుతోంది. పెళ్లికి ఇంకా సమయం ఉండటంతో అతిథులంతా బయట కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇంతలో వధువులా తయారైన ఓ మహిళ అష్టవంకరలు తిరుగుతూ అక్కడికి వచ్చింది. పెళ్లి కూతురు ఎక్కడ ఉందని అడిగింది. అతిగా వయ్యారం వలకబోస్తున్న ఆ మహిళ గొంతు విని.. అతిథులకు అనుమానం వచ్చింది. ‘‘ఓ అమ్మాయ్.. ఇలా రా, ఏ ఊరు మనది’’ అని అడిగారు. ‘‘మాదీ ఈ ఊరే’’ అని గంభీరంగా చెప్పింది. దీంతో వారికి సీన్ అర్థమైంది. ఏకంగా పెళ్లి కూతురు గెటప్‌ వేసుకుని తన లవర్‌ ఇంటికి చేరుకున్నాడు. అయితే, నవ వధువు వేషంలో వచ్చిన యువకుడిని చూసిన అమ్మాయి తండ్రి, బంధువులు కాసింత షాకయ్యారు.

కొత్త పెళ్లి కూతురు తన కూతురి కోసం రావటంతో కాస్త అనుమానంతో ముఖం మీద ముసుగు తీయాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆ యువకుడి గుట్టు రట్టయింది. యువతి తండ్రి, బంధువులు అతన్ని పట్టుకుని దేహశుద్ది చేసేలోగానే… అప్రమత్తమైన యువకుడు ఫ్రెండ్‌ బైక్‌ ఎక్కి వెంటనే అక్కడ్నుంచి పరారయ్యాడు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This