Friday, July 30, 2021

కృష్ణా జలాల్లో వాటా తెలంగాణకు రావలసిందే…పోరాడి నీళ్లు తెచ్చుకుంటాం : సిఎం కెసిఆర్

Must Read

తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మధ్య ఎప్పటినుంచో నలుగుతున్న కృష్ణ నది జలాల విషయంలో సీఎం కెసిఆర్ పలు వ్యాఖ్యలు చేశారు. కృష్ణా నదీ జలాల వినియోగంలో, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ వైఖరి, తెలంగాణ రైతాంగ ప్రయోజనాలు దెబ్బతీసేలా వున్ననేపథ్యంలో, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు తాము అన్ని వేదికల మీద రాజీ లేకుండా పోరాడుతామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు పునరుద్ఘాటించారు. ఈ నేపథ్యంలో.. ట్రిబ్యునల్స్, న్యాయస్థానాలు సహా రాబోయే పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ తరుపున గట్టిగా మాట్లాడాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో, కృష్ణా ట్రిబ్యునల్, కెఆర్ఎంబీ తదితర వేదికల మీద తెలంగాణ వాణిని బలంగా వినిపించాలని నిర్ణయించింది.

తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత సాగునీటి కష్టాలు ఉండకూడదని ప్రభుత్వం భావిస్తుంది. నదీ జలాల్లో రాష్ట్ర సాగునీటి వాటాను హక్కుగా పొందడానికి, భవిష్యత్తులో అనుసరించాల్సిన వ్యూహం ఖరారు దిశగా, సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో మంగళవారం అత్యున్నతస్థాయి సమావేశం జరిగింది. ఆరు గంటలకు పైగా జరిగిన సమీక్షా సమావేశంలో, తెలంగాణకు దశాబ్దాలుగా జరుగుతున్న సాగునీటి వివక్ష గురించి సమావేశం లోతుగా చర్చించింది. స్వయం పాలనలో సాగునీటి కష్టాలను ఎట్టి పరిస్థితిల్లోనూ రానివ్వకూడదని సమావేశం తీర్మానించింది. రాష్ట్రం తరఫున ఎటువంటి వ్యూహాన్ని ఎత్తుగడలను అనుసరించాలనే విషయాలకు సంబంధించి సమావేశంలో చర్చించిన సిఎం కెసిఆర్, అధికారులకు ఆ దిశగా మార్గనిర్దేశం చేసారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This