Saturday, June 19, 2021

ఆనందయ్య మందు వేసుకున్న హెడ్‌మాస్ట‌ర్ కోటయ్య చనిపోవడానికి కారణం ఇదే..!

Must Read

కృష్ణపట్నంలో కరోనా మందు తీసుకున్న రిటైర్డ్ హెడ్ మాస్టర్ కోటయ్య మృతి ఒక్కసారిగా అందరిని షాక్ కి గురి చేస్తుంది.. కొన్ని రోజుల క్రితం ఆయన ఆ మందు వేయించుకున్న విష‌యం తెలిసిందే. తనకు అనారోగ్యం సమయంలో ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా తగ్గలేదని కాని.. ఎప్పుడైతే ఆనందయ్య మందు కంట్లో వేసుకున్ననో క్షణాల్లో తనకు నయం అయ్యిందని ఆయ‌న చేసిన వ్యాఖ్య‌ల వీడియో బాగా వైర‌ల్ అయింది.అయితే కరోనా మహమ్మారితో పోరాడుతూ రిటైర్డ్ హెడ్‌మాస్టర్ కోట‌య్య మృతితో విషాదం నెలకొంది.

ఆనంద‌య్య ద‌గ్గర మందు తీసుకున్న ఆనందయ్య దగ్గర తీసుకున్న కంటి చుక్కల మందు తో రెండు నిమిషాల్లో తాను లేచి కూర్చున్నానని, ఆక్సిజన్ లెవెల్స్ సైతం వెంటనే పెరిగాయని కోటయ్య చెప్పిన వీడియో ఏపీ, తెలంగాణలో పాటు దేశ వ్యాప్తంగా బాగా వైరల్ అయింది. ఆనందయ్య మందు తీసుకున్న వెంట‌నే ఆక్సిజన్ లెవెల్స్ పెరిగి న‌యం అయిన‌ట్టు అనిపించినా.. ఆరోగ్యం స‌హ‌క‌రించ‌క‌పోవ‌డంతో మ‌ళ్లీ ఆయ‌న నెల్లూరు ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో చేరారు. కొంత మంది మాత్రం ఆనంద‌య్య మందు విక‌టించ‌డం వ‌ల్లే ఈ ప‌రిస్థితి వ‌చ్చింద‌ని క‌థ‌నాలు కూడా వేసారు.

ఇన్ని రోజులు ‌హాస్పిటల్లో చికిత్స పొందిన కోట‌య్య‌.. ఇవాళ ఉద‌యం చ‌నిపోగా.. గుట్టుచ‌ప్పుడు కాకుండా మృత‌దేహాన్ని కుటుంబసభ్యులు ఇంటికి తీసుకెళ్లిన‌ట్టు స‌మాచారం.

మరోవైపు ఆనందయ్య పంపిణీ చేస్తున్న కరోనా ఔషధంపై ఆయుష్ శాఖ నిపుణుల అధ్యయనం పూర్తి చేసింది. ఆయుష్ కమిషనర్ రాములు కృష్ణపట్నంలో పర్యటించి మందు తయారీలో వాడుతున్న పదార్థాలను పరిశీలించారు. ఏపీలో జగన్ ప్రభుత్వం ఆనండయ్య మందుకు ఆమోదం తెలిపింది.. అలాగే కోర్టు కూడా ఆనందయ్య మందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This