Tuesday, July 27, 2021

రద్దయిన రూ.49కోట్ల పాతనోట్లను ఏం చేయాలి… ఆలోచనలో టీటీడీ!

Must Read

పాతనోట్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయంపై టీటీడీ ఎదురుచూపులు చూస్తోంది. తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన తమ దగ్గరున్న పాతనోట్ల విషయంలో త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరుతోంది.

టీటీడీ దగ్గర మొత్తం రూ.49.70 కోట్ల విలువైన 1.8లక్షల రూ.వెయ్యి, 6.34 లక్షల రూ.500 పాత నోట్లు ఉన్నాయి. టీటీడీ వద్ద నిల్వ ఉన్న రద్దు చేసిన పాతనోట్లకు సంబంధించి ఏమి చేయాలన్న దానిపై సందిగ్ధత కొనసాగుతోంది. దీనికి సంబంధించి గతంలో టీటీడీ పూర్వ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి నాలుగుసార్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలిశారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వు బ్యాంకుకు లేఖలు రాశారు. ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా వారి నుంచి ఎలాంటి సానుకూల స్పందన రాలేదు.

తిరుమల యాత్రికులు శ్రీవారికి సమర్పించిన పాతనోట్లను ఏం చేయాలో తెలీక టీటీడి అయోమయంలో పడిపోయింది. ఇటీవల జరిగిన టీటీడీ బోర్డు సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి ఈ విషయాన్ని ప్రస్తావించారు. మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో కేంద్రం ఈ విషయంలో స్పష్టత ఇవ్వాలని ఎక్కువ రోజులు వీటిని పెట్టుకోలేమని కూడా ఆయన మీడియాకు వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం పాతనోట్లు రద్దు చేసి ఇప్పటికే నాలుగున్నర సంవత్సరాలు అవుతోంది. ఇన్నాళ్లయిన టీటీడీ విన్నపాలను పట్టించుకోని కేంద్రం.. ఇకమీదటైనా స్పందిస్తుందా?

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This