Saturday, June 19, 2021

అంత్యక్రియలు జరిగిన వారం రోజులకు తిరిగొచ్చిన భార్య!

Must Read

కరోనా బారిన పడిన ఓ వృద్ధురాలు చనిపోయిందని భావించిన కుటుంబసభ్యులు.. ఆమె మృతదేహం అనుకుని వేరే మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. అంత్యక్రియలు జరిపిన మహిళ 15 రోజుల తర్వాత తిరిగి రావడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో జరిగిన ఘటన సంచలనం సృష్టించింది. ఆమెకు అంత్యక్రియలతోపాటు పెద్దకర్మ కూడా జరిపిన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తిరిగొచ్చిన మహిళను చూసి షాక్ కు గురయ్యారు. చనిపోయిన మహిళ తిరిగొచ్చిందన్న విషయం గ్రామంలోనే కాదు చుట్టు పక్కల ప్రాంతాల్లో సంచలనం సృష్టించింది.

అసలేం జరిగిందంటే.. జగ్గయ్యపేటలోని క్రిస్టియన్ పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ (75) కరోనా సోకడంతో గత నెల 12వ తేదీన విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఆమె భర్త గిడ్డయ్య మూడో రోజు ఆస్పత్రికి వెళ్లగా బెడ్ పై ఉండాల్సిన ముత్యాల గిరిజమ్మ కనిపించలేదు. ఆసుపత్రి సిబ్బందిని ప్రశ్నించగా వేరే వార్డుకు మారినట్లుందన్న సమాధానంతో ఆస్పత్రి అంతా వెదికాడు. ఎక్కడా కనిపించకపోవడంతో మరోసారి సిబ్బందిని ప్రశ్నించగా మార్చురీలో ఉందేమో చూసుకోమని సలహా ఇచ్చారు.

మార్చురీలో మృతదేహం కోసం వెతికారు. మరో వృద్ధురాలి మృతదేహాన్ని గిరిజమ్మదిగా భావించి ఇంటికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఇంతలో బుధవారం ఉదయం గిరిజమ్మ ఆటోలో వచ్చి ఇంటి ముందు దిగింది. దీంతో ఆమెను చూసిన కుటుంబీకులు, స్థానికులు షాక్ అయ్యారు. తాను విజయవాడ ఆస్పత్రి నుంచే వచ్చినట్లు చెప్పడంతో తలలు పట్టుకున్నారు.

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This