Saturday, June 19, 2021

కాల్‌సెంటర్‌ జాబ్ పోయిన అమ్మాయిలతో ఆన్‌లైన్‌ వ్యభిచారం..

Must Read

కరోనా దెబ్బతో ఎంతో మంది తమ ఉద్యోగాలు కోల్పోయారు. అలా ఉద్యోగాలు కోల్పోయిన కొంత మంది కాల్‌సెంటర్‌ అమ్మాయిలకు మాయమాటలు చెప్పి ఆన్‌లైన్‌ వ్యభిచార కూపంలో లాగిన ముఠాను బాలాపూర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు పరారీలో ఉండగా ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు. రాచకొండ కమిషనర్‌ మహేష్‌భగవత్‌ చెప్పిన వివరాల ప్రకారం: ఆంధ్రప్రదేశ్‌ లో అన్నవరానికి చెందిన శివ అలియాస్‌ బడ్డి నగరంలో ఆన్‌లైన్‌ వ్యభిచారలకి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. వెస్ట్‌ గోదావరికి చెందిన సతీష్‌(28), చరణ్‌ నాయక్‌(30) మహేష్‌(31)లతో కలిసి ఏడాదిగా నగర శివారులోని జల్‌పల్లి పురపాలిక శివారులోని నక్షత్ర విలాస్‌లో ఉంటూ ఆన్‌లైన్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్నాడు. ప్రత్యేకంగా APP‌ను పెట్టి కావలసిన వారికి యువతులను అందజేసి ముందుగా డబ్బులు తీసుకుంటున్నారు.

పోలిసుల కధనం ప్రకారం బాలాపూర్‌ ఎస్సై నాగరాజు శివతో ఆన్‌లైన్‌లో సంప్రదించారు. అమ్మాయి కావాలన్నారు. సరేనన్న శివ బేరం కుదుర్చుకుని తన వాళ్లైన ముగ్గురితో యువతిని కారులో చెప్పిన చోటుకు పంపించాడు. దీంతో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ముఠా ఆన్‌లైన్‌ దందా గుట్టురట్టు చేశారు.

నక్షత్ర విలాస్‌కి వెళ్లి ఇద్దరు యువతులను రక్షించి విచారించగా లాక్‌డౌన్‌తో ఉద్యోగాలు కోల్పోయిన తమను మాయమాటలు చెప్పి నమ్మించి వ్యభిచార కూపంలోకి దింపారని తెలిపారు. ఎంతమందిని ఇలా ఈ ఉచ్చులోకి లాగారనే విషయంపై దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ప్రధాన నిందితుడు శివ పరారీలో ఉన్నాడు. యువతులను కూకట్‌పల్లిలోని హోమ్‌ లో ఉంచి చికిత్స్ అందిస్తునారు

Latest News

వ్యాక్సిన్ తీసుకున్నాక ఆ పని చేయ‌వ‌చ్చా?

క‌రోనా కేసులు క్ర‌మంగా తగ్గుముఖం ప‌డుతున్నాయి. వ్యాక్సినేష‌న్‌ను వేగవంతం చేయ‌డంతో క్ర‌మంగా కేసులు తగ్గుతున్నాయి. అయితే, కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నాక వ్యాయామం చేస్తే ఏమౌతుంది అనే...

More Articles Like This