ఇదేం వింత..ఐదు రోజుల లేగదూడ పాలు ఇస్తోంది

అప్పుడే పుట్టిన లేగదూడ పాల కోసం తపిస్తుండటం చూసి ఉంటాం, త‌ల్లి చుట్టు తిరుగుతూ పాల కోసం చెంగు చెంగున ప‌రుగులు పెడుతుంది, అయితే పట్టుమని పదిరోజులైనా నిండని లేగదూడ పూటకు లీటరు పాలు ఇచ్చి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ వార్త తెలిసి అంద‌రూ షాక్ అయ్యారు, అంతేకాదు అస‌లు ఈ వింత చూడాలి అని వంద‌ల మంది దాని ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నారు.

ఓ లేగదూడ మాత్రం వింతగా లీటర్ల కొద్ది పాలు ఇస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తోంది. అది పుట్టి కేవలం 5 రోజులు కూడా కాలేదు అప్పుడే ఆవులా పాలు ఇవ్వడం చూసి జనం ఇదేం వింత అని చర్చించుకుంటున్నారు. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం కొత్తలోలం గ్రామంలో ఇది చోటు చేసుకుంది. ఈ విషయం ఆనోటా ఈనోటా అందరికి తెలిసిపోయింది. దీంతో ఈ దూడను చూసేందుకు జనం పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

మహ్మద్‌ అజారుద్దీన్‌ అనే పాడిరైతుకు కొన్ని ఆవులు ఉన్నాయి. వాటి పాల ద్వారా అతడు జీవనోపాధి పొందుతున్నాడు. అతనికి చెందిన డైరీఫామ్‌లో ఓ జెర్సీ ఆవు ఐదురోజుల క్రితం లేగదూడకు జన్మనిచ్చింది. అయితే శుక్రవారం దాని పొదుగు పెద్దది కావడాన్ని ఆ రైతు గమనించాడు. ఏం జరుగుతుందని అతనికి అర్థం కాలేదు. ఎందుకైనా మంచిదని దాన్ని తడిమి చూశాడు. వెంటనే పొదుగు నుంచి పాలు కారడం ప్రారంభం అయ్యాయి.

చిన్న లేగదూడ పాలు ఇవ్వడం ఏంటని వెంటనే పశువైద్యులను సంప్రధించాడు. వారు పరీక్షించి అది హర్మోన్ల ప్రభావంగా గుర్తించారు. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా చోటు చేసుకుంటాయని చెప్పాడు. అయితే ఈ పాలు తాగ‌డం మంచిదా కాదా అనేదానిపై కూడా భిన్న‌వార్త‌లు వ‌స్తున్నాయి, అయితే ప‌శువైద్యులు మాత్రం ఈ పాలు తాగ‌కపోవ‌డం మంచిది అని చెబుతున్నారు, మ‌రికొంద‌రు మాత్రం ఈ ఆవు పాలు చాలా బ‌లం క‌లిగి ఉంటాయి అని చెబుతున్నారు.. వైద్యులు మాత్రం ఈ పాలు తాగ‌కుండా దూరంగా ఉండాలి అని ఇలాంటి వాటి వ‌ల్ల కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయి అని చెబుతున్నారు.

Content above bottom navigation