Tuesday, July 27, 2021

ఎట్టకేలకు బీజేపీలో చేరిన ఈట‌ల‌..

Must Read

ఎట్టకేలకు తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీ సభ్యత్వం తీసుకున్నారు. దీనికోసమే ప్ర‌త్యేకంగా ఢిల్లీ వెళ్లిన ఆయ‌న‌.. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, బీజేపీ తెలంగాణ ఇన్‌ఛార్జ్‌ తరుణ్‌చుగ్‌ సమక్షంలో కాషాయ కండువా క‌ప్పుకున్నారు. ఈటలతో పాటు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి, మాజీ జెడ్పీ ఛైర్‌పర్సన్‌ తుల ఉమ,గండ్ర నళిని, ఆర్టీసీ కార్మిక సంఘం నేత అశ్వత్థామరెడ్డి, పలువురు నేతలు బీజేపీ లో సభ్యత్వం తీసుకున్నారు.

ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ కూడా కాషాయ కండువా కప్పుకున్నారు. బీజేపీలో చేర‌గానే ఈట‌లకు.. పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని అందించారు ధర్మేంద్ర ప్రధాన్‌. కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌తో పాటు ప‌లువురు నేత‌లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This