500 కోట్ల డోసులు రెడీ..! పపంచానికి వ్యా క్సిన్ హైదరాబాద్ నుంచే…

147

ఏటా ఐదు బిలియన్‌ డోసుల(500 కోట్లు) వ్యాక్సిన్‌ను తయారు చేస్తూ హైదరాబాద్‌ ఫార్మా.. వ్యాక్సిన్‌ క్యాపిటల్‌గా ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇది ప్రపంచ ఉత్పత్తిలో మూడోవంతు అని తెలిపారు. కొవిడ్‌-19 సంక్షోభం నుంచి బయటపడేలా హైదరాబాద్‌ లైఫ్‌ సైన్సెస్‌ పరిశ్రమ గట్టి ప్రయత్నాలు చేస్తోందని, ఆ దిశగా ఇప్పటికే ఫలవంతమైన భాగస్వామ్యాన్ని అందించిందని తెలిపారు.

కరోనా వ్యాక్సిన్‌ అభివృద్ధికి తెలంగాణలో జరుగుతున్న ప్రయత్నాలను వివరిస్తూ, దేశీయంగా బయోటెక్‌ పరిశ్రమలను ఉన్నతస్థానాలకు తీసుకువెళ్లేందుకు, బయోరంగంలో భారత్‌ స్థానాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఉన్న అవకాశాలు, తీసుకోవాల్సిన చర్యలను ప్రస్తావిస్తూ మంత్రి కేటీఆర్‌ గురువారం(ఆగస్టు 6,2020) కేంద్ర ఆరోగ్య, సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ మంత్రి హర్షవర్ధన్‌కు లేఖ రాశారు.

బయోటెక్ రంగంలో భారత్‌ను అగ్ర స్థానంలో నిలపాలంటే అనుమతుల విషయంలో మరింత సులభంగా ఉండేలా నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. వ్యాక్సిన్‌ తయారీ, టెస్టింగ్ అనుమతుల విషయంలో మరింత వికేంద్రీకరణ అవసరమని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. కొవిడ్ వ్యాక్సిన్ లైసెన్సింగ్ మార్గదర్శకాలను వెంటనే విడుదల చేయాలని కేంద్ర మంత్రిని కోరారు.

పూర్తి వివరాలకోం ఈ క్రింద వీడియో చూడండి:

హైదరాబాద్ వాసులకు గుడ్ న్యూస్ … నగరంలో క్షీణించిన వైరస్ …?

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation