చైనీయులకు అమెరికాలో నరకం.. మాల్స్ నుండి గెంటివేత చుక్కలు చూపిస్తోన్న అమెరికన్లు..!!

146

చైనా నుంచి వైరస్ ఇప్పుడు అమెరికాలో విలయతాండవం చేస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహమ్మారి చైనీయులకు శాపంగా మారింది. ఇప్పటికే ఈ వైరస్ చైనా వైరస్ అని దేశ అద్యక్షుడు ట్రంప్ అన్నాడు. దాంతో అమెరికన్స్ కూడా ఇధి చైనా వైరస్ అని, చైనా వాళ్ళ మీద తమ ప్రతాపం చూపిస్తున్నారు. అమెరికాలో చైనా దేశస్థులు ఎక్కడ కనిపించినా స్థానికులు వారిపై దాడులకు దిగుతున్నారు. ఇటీవల అమెరికాలో చైనాకు చెందిన ఓ మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. కాలిఫోర్నియాలోని చైనాటౌన్ మెట్రో స్టేషన్‌ లో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ వార్త మరువక ముందే లాస్ ఏంజెల్స్‌ లో చైనా దేశస్థులను అమెరికన్లు దూషిస్తున్నారంటూ మరో వార్త వచ్చింది. చైనీయుల వల్ల తమ దేశస్థులకు వైరస్ సోకుతోందంటూ అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు. దీంతో చైనీయులు ఎక్కడ కనిపించినా వారిపై ఆగ్రహం వెల్లగక్కుతున్నారు. షాపింగ్ మాల్స్ లలో కనిపించినసరే మెడపట్టి బయటకు నెట్టేస్తున్నారు.

అమెరికాలో చైనా వాళ్ళు బతకలేని పరిస్తితి వస్తుంది. అందుకే తమ సొంత దేశమైన చైనాకు వెళ్లిపోవాలని అక్కడ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, చదువుకుకుంటున్న వాళ్ళు అనుకుంటున్నారు. చదువుకుంటున్న సంపన్న కుటుంబాలకు చెందిన చైనా విద్యార్థులు యూఎస్ నుంచి బయటపడేందుకు వేలాది డాలర్లు ఖర్చు చేసేందుకు కూడా వెనకాడడం లేదు. ప్రైవేటు జెట్ విమానాల్లో సీట్ల కోసం పెద్ద ఎత్తున సొమ్ము చెల్లించేందుకు తల్లిదండ్రులను సైతం ఒప్పిస్తున్నారు. ప్రస్తుతం విమాన సర్వీసులు నిలిచిపోవడంతో అమెరికా నుంచి బయటపడే అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రైవేట్ జెట్లను ఆశ్రయిస్తున్నారు. ఇందులో ఒక్కో సీటు కోసం 20 వేల డాలర్లు అంటే సుమారు రూ. 15 లక్షలు సైతం వెచ్చించేందుకు వెనకాడడం లేదు.

ఇదిలా ఉండగా.. న్యూయార్క్‌లోని ఫ్లషింగ్ ప్రాంతానికి వెళ్లేందుకు క్యాబ్ డ్రైవర్లు జంకుతున్నారు. ఈ ప్రాంతంలో చైనా దేశస్థులు ఎక్కువగా జీవిస్తుండటమే దీనికి కారణం. ఫ్లషింగ్ ప్రాంతంలో 70 వేలకు పైగా చైనా దేశస్థులు నివసిస్తున్నారు. దీంతో ఆ ప్రాంతంలోని కస్టమర్లను ఎక్కించుకుంటే తమకు కూడా వైరస్ సోకుతుందేమోనని క్యాబ్ డ్రైవర్లు భయపడుతున్నారు. ఆ ప్రాంతానికి వెళ్తే.. యాప్‌ లో ఆన్‌లైన్ నుంచి ఆఫ్ లైన్‌ కు వెళ్లిపోతున్నారు. తిరిగి వేరే ప్రాంతానికి వెళ్లి తిరిగి ఆన్‌ లైన్‌ కు వస్తున్నారు. ఫ్లషింగ్ ప్రాంతమే కాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌ల నుంచి వచ్చే ప్రయాణికులను సైతం క్యాబ్ ఎక్కించుకోడానికి డ్రైవర్లు భయపడుతున్నారు. ఇలా రోజురోజుకూ అమెరికాలో చైనీయుల పరిస్తితి ఆగమ్య ఘోచరంగా తయారయ్యింది.

Content above bottom navigation