తెలంగాణలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేనంతగా తక్కువ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో- కరోనా బారి నుంచి కోలుకున్న వారి సంఖ్యలో స్థిరత్వం కొనసాగుతోంది.
ఇది కూడా చదవండి: పక్క వాళ్లకి అంటిస్తే రూ.10 లక్షల జరిమానా.. ఈనెల నుంచే అమలు
యాక్టివ్ కేసుల సంఖ్యలోనూ క్షీణత కనిపించింది. మరణాల సంఖ్యలో పెద్దగా ఎలాంటి మార్పూ నమోదు కాలేదు. రోజువారీ కరోనా పాజిటివ్ కేసులు ఉన్నట్టుండి తగ్గడానికి ప్రధాన కారణం.. టెస్టులను తగ్గించడమేనని తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: గుడ్ న్యూస్: 21 నుంచి ఆక్స్ ఫర్డ్ చివరి ట్రయల్స్ ..అందుబాటులోకి ఎప్పుడంటే ?
రోజువారీ కరోనా పరీక్షలు సగానికి తగ్గించిన ప్రభావం పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుదలకు కారణమైందని అంటున్నారు. తెలంగాణలో కొత్తగా 24 గంటల వ్యవధిలో 1,307 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. తొమ్మిదిమంది మరణించారు.