Breaking News.. కరోనా ఎఫెక్ట్ బంగారం ధరలు భారీ షాక్ ..తులం ఎంతంటే ?

బంగారం కొనాలనుకుంటున్నారా? అయితే మీకు దిమ్మతిరిగే న్యూస్. గత రెండు రోజులుగా తగ్గుతూ ఉన్న బంగారం ధర ఒక్క రోజులోనే భారీగా పెరిగింది. బంగారం ధర పెరిగితే వెండి ధర మాత్రం తగ్గింది. హైదరాబాద్ మార్కెట్‌లో బుధవారం 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.180 పెరుగుదలతో రూ.45,980కు చేరింది. అదేసమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.180 పెరుగుదలతో రూ.42,160కు చేరింది. బంగారం ధర పరుగులు పెడితే వెండి ధర మాత్రం పడిపోయింది. కేజీ వెండి ధర రూ.1,000 మేర తగ్గడంతో ధర రూ.48,500కు దిగొచ్చింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ మందగించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం 1660 డాలర్ల కిందకు వచ్చేసింది. బంగారం ధర ఔన్స్‌కు 0.16 శాతం తగ్గుదలతో 1657.40 డాలర్లకు పడిపోయింది. బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం ఔన్స్‌కు 0.49 శాతం పెరుగుదలతో 17.03 డాలర్లకు చేరింది. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విశాఖపట్నంలో కూడా బంగారం, వెండి ధరల పరిస్థితి కూడా ఇలానే ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 పెరుగుదలతో 10 గ్రాములకు రూ.41,720కు చేరింది. వెండి ధర కూడా రూ.130 పెరుగుదలతో రూ.50,160కు చేరింది. విశాఖపట్నంలోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌ లో బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు.. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.42,850 వద్దనే నిలకడగా ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా రూ.44,050 వద్దనే స్థిరంగా కొనసాగుతోంది. ఇక వెండి ధర రూ.1000 తగ్గుదలతో రూ.48,500కు పడిపోయింది.

బంగారం ధర పెరగడానికి ప్రధాన కారణం కరోనా వైరస్. చైనా వెలుపల ఇతర దేశాల్లోనే ఈ వైరస్ వేగంగా విస్తరిస్తుండటంతో సురక్షిత ఇన్వెస్ట్‌మెంట్ సాధనమైన బంగారానికి డిమాండ్ పెరిగింది. దీంతో బంగారం ధర గ్లోబల్ మార్కెట్‌ లో మళ్లీ పరుగులు పెట్టింది. దీంతో మన మార్కెట్‌ లో కూడా పెరిగింది. బంగారం రేటు రానున్న కాలంలో మరింత పెరిగే అవకాశముందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులు ఇందుకు దోహదపడతాయని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు.

దేశీయంగా కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి బలహీనపడితే.. ఆ అంశం కూడా బంగారం పెరగడానికి కారణంగా నిలవొచ్చని తెలిపారు. బంగారం ధర రానున్న కాలంలో రూ.45,000కు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation