తగ్గుదలకు బ్రేక్.. పెరిగిన బంగారం ధర.. తగ్గిన వెండి!

198

పసిడి ధర తగ్గుదలకు బ్రేకులు పడ్డాయి. గత కొన్ని రోజులుగా పడుతూ వచ్చిన బంగారం ధర ఈరోజు పైకి కదిలింది. బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గినా కూడా దేశీ మార్కెట్లో పసిడి ధర పెరగడం గమనార్హం. బంగారం ధర పెరిగితే.. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది.

పూర్తి వివరాలకు ఈ వీడియో చూడండి

హైదరాబాద్ మార్కెట్లో శనివారం బంగారం ధర పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.190 పైకి కదిలింది. దీంతో ధర రూ.44,750కు చేరింది. అదేసమయంలో 24 క్యారెట్ల బంగారం ధర కూడా ఇదే దారిలో నడిచింది. 10 గ్రాముల బంగారం ధర రూ.190 పెరిగింది. దీంతో ధర రూ.48,830కు ఎగసింది.

పసిడి ధర పెరిగితే.. వెండి ధర మాత్రం తగ్గింది. కేజీ వెండి ధర స్వల్పంగా రూ.20 క్షీణించింది. దీంతో ధర రూ.48,480కు తగ్గింది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్ క్షీణించడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు.ఇక అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గింది. పసిడి ధర ఔన్స్కు 2.26 శాతం దిగొచ్చింది. దీంతో ధర ఔన్స్కు 1688 డాలర్లకు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర కూడా ఇదే దారిలో పయనించింది. వెండి ధర ఔన్స్కు 2.74 శాతం తగ్గుదలతో 17.56 డాలర్లకు క్షీణించింది.


దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్లో పసిడి ధరలో ఎలాంటి మార్పు లేదు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర స్థిరంగానే కొనసాగింది. దీంతో ధర రూ.45,300 వద్దనే నిలకడగా ఉంది. అదేసమయంలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర కూడా స్థిరంగానే కొనసాగుతోంది. రూ.46,500 వద్దనే ఉంది. కానీ కేజీ వెండి ధర తగ్గింది. రూ.20 తగ్గుదలతో రూ.48,480కు క్షీణించింది.

ఇకపోతే బంగారం ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.

Content above bottom navigation