Friday, July 30, 2021

హన్సిక 50వ చిత్రం “మహా” టీజర్

Must Read

కోలీవుడ్ స్టార్ హీరోయిన్ హన్సిక మోత్వానీ 50 వ చిత్రం “మహా”. తాజాగా ఈ సినిమా టీజర్ ను విడుదల చేశారు. ప్రముఖ కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ టీజర్ ను రిలీజ్ చేసి సినిమా మంచి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ రిలీజ్ చేశారు. సిలంబరసన్, శ్రీకాంత్, సనమ్ శెట్టి, తంబి రామయ్య, కరుణకరన్, మహాత్ రాఘవేంద్ర, సుజిత్ శంకర్, నందిత జెన్నిఫర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నూతన దర్శకుడు యుఆర్ జమీల్ దర్శకత్వం వహించాడు. ఈ చిత్ర సంగీతాన్ని జిబ్రాన్ స్వరపరిచారు, మాడి సినిమాటోగ్రఫీ, జోహన్ అబ్రహం ఎడిటింగ్‌ చేస్తున్నారు. ఎట్సెటెరా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మతి అజగన్ నిర్మించారు.

ఈ టీజర్ చూస్తుంటే సినిమా సస్పెన్స్ అండ్ క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కినట్టు తెలుస్తోంది. ఇందులో హన్సిక మాజీ ప్రియుడు శింబుతో మరోసారి రొమాన్స్ చేసింది ఈ బ్యూటీ. టీజర్ చాల మలుపులతో కూడుకుని ఆసక్తికరంగా ఉంది. హన్సిక నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ చిత్రం గత వేసవిలో విడుదల కావాల్సి ఉన్నప్పటికీ, కరోనావైరస్ మహమ్మారి కారణంగా మేకర్స్ విడుదలను వాయిదా వేశారు. ఈ చిత్రం ఓటిటి ప్లాట్‌ఫామ్‌లో విడుదల కావచ్చని వార్తలు వచ్చాయి. కానీ అధికారిక ప్రకటన రాలేదు. మీరు కూడా క్రైమ్ థ్రిల్లర్ “మహా” టీజర్ చూడంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This