హైపర్ ఆది పెళ్లి డేట్ ఫిక్స్.. అమ్మాయి ఎవరో చూస్తే షాక్

జబర్దస్త్‌లో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్‌ ప్రారంభించి, స్క్రిప్ట్ రైటర్‌‌గా టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు హైపర్ ఆది. అనతికాలంలోనే బుల్లితెరపై తన పంచులతో ఒక రేంజ్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు జబర్ధస్త్ టీం లీడర్స్‌లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతనికే ఉంది. అయితే కొన్నాళ్లుగా ఆది ఎఫైర్స్‌తో వార్తల్లో నిలిచాడు. ఆ మధ్య అనసూయతో చనువుగా ఉంటున్నాడని వార్తలు రాగా, ఇటీవల యాంకర్ వర్షిణితో ప్రేమాయణం నడుపుతున్నాడని పుకార్లు వచ్చాయి. అలాగే తన కంటే ముందు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్ పెళ్లి అయితేనే తాను కూడా పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుదల పట్టాడు.

అయితే తాజాగా హైపర్ ఆది పెళ్లి విషయంలో తన డెసిషన్ మార్చుకున్నాడనే తెలుస్తోంది. తన ఇంట్లో సంబంధాలు చూస్తున్నారని అయితే తన తల్లిదండ్రులు చూసిన ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు తాను ఫిక్స్ అయ్యానని చెప్పుకొచ్చాడు. అంతేకాదు హైపర్ ఆది తన పెళ్లి డేట్ కూడా చెప్పేసి అందరినీ సర్ ప్రైజ్ ఇచ్చేశాడు. తనకు నెక్ట్స్ ఇయర్ పెళ్లి అవుతుందని, తమ స్వంత జిల్లా ప్రకాశం కు చెందిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నట్లు హైపర్ ఆది క్లారిటీ ఇచ్చేశాడు. దీంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

అయితే హైపర్ ఆది అంటే అమ్మాయిల్లో అంత ఫాలోయింగ్ లేదనే పేరుంది. ఎందుకంటే, సుడిగాలి సుధీర్, ప్రదీప్ లకు ఉన్నంత క్రేజ్ అమ్మాయిల్లో హైపర్ ఆదికి లేదనే అంటారు. కానీ ఓ టైప్ మాస్ అమ్మాయిలు మాత్రం హైపర్ ఆది అంటే పడి చస్తారట. తాజాగా తనకు ఎదురైన ఓ సంఘటనను ఉదాహరణగా ఆది చెప్పుకొచ్చాడు. ఈ మధ్యకాలంలో ఒంగోలులో ఓ ఫంక్షన్ కు వెళ్లానని, అయితే అక్కడ ఓ అమ్మాయి వచ్చి తన పక్కన కూర్చుందని

, గలగల మాట్లాడటమే కాదు, సెల్ఫీలు కూడా దిగిందని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన కుటుంబ సభ్యులకు వీడియో కాల్ చేసి తనతో మాట్లాడించిందని చెప్పాడు. అయితే తాను ఎక్కడికి వెళ్లినా వదలకుండా రోజంతా తనతోనే ఆ అమ్మాయి గడిపిందంటూ, ఈ మధ్యకాలంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొస్తు, సిగ్గు పడ్డాడు. దీంతో అసలు సంగతి బయటపడింది. హైపర్ ఆది కనిపించడు కానీ, చాలా విషయమే ఉందంటూ అతడి ఫాలోయర్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ సీక్రెట్ డేటింగ్ ఎంత వరకూ దారి తీస్తుందో చూడాలి మరి.

Content above bottom navigation