కరోనాపై గుడ్ న్యూస్ చెప్పిన ఇటలి శాస్త్రవేత్తలు ఇక వైరస్ చచ్చినట్టే

143

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి గజగజా వణికిస్తోంది. ప్రతిరోజూ వేల సంఖ్యలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలు చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కోసం అహర్నిషలు శ్రమిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేర్వేరు వ్యాక్సిన్ల ప్రయోగాలు వేర్వేరు దశల్లో ఉన్నాయి. కరోనా వల్ల విపత్కర పరిస్థితులు నెలకొన్న సమయంలో ఇటలీలోని బోలోగ్నా వర్సిటీ శాస్త్రవేత్తలు ప్రపంచానికి శుభవార్త చెప్పారు.కరోనా వైరస్ లో జన్యుమార్పులు తగ్గుముఖం పట్టాయని వాళ్లు తెలిపారు.

కరోనా వైరస్ కు కారణమైన సార్స్ కోవ్ 2 లో ఆరు జాతులు ఉన్నప్పటికీ తక్కువ వైవిధ్యాన్నే చూపుతున్నట్టు తెలిపారు. 48,635 కరోనా వైరస్ జన్యువులను విశ్లేషించి ఈ ఫలితాలను వెల్లడించారు. వ్యాక్సిన్లపై ప్రయోగాలు చేపడుతున్న వాళ్లకు ఇది శుభవార్తే అని చెప్పవచ్చు. ఈ అధ్యయనం ఫాంట్రియర్స్ ఇన్ మైక్రోబయాలజీలో ప్రచురితమైంది. నావల్ కరోనా వైరస్ తక్కువ వైవిధ్యాన్ని చూపుతోందని… ఒక శాంపిల్ దాదాపు ఏడు మ్యుటేషన్లను కలిగి ఉన్నట్లు గుర్తించామని చెబుతున్నారు.

పరిశోధకులు సాధారణ ఫ్లూలో ఇంతకంటే రెట్టింపు వైవిధ్యాలు ఉన్నట్టు గుర్తించామని అన్నారు. బోలోగ్నా యూనివర్సిటీ శాస్త్రవేత్త ఫెడరికో జార్జి మాట్లాడుతూ వ్యాక్సిన్ తో పాటు రోజురోజుకు అభివృద్ధి చేస్తున్న చికిత్సా విధానాలు వైరస్ జాతులకు వ్యతిరేకంగా ప్రభావవంతంగా ఉండవచ్చని చెప్పారు.

పూర్తి వివరాలకోసం ఈ క్రింద వీడియో చూడండి:

వేడి నీళ్ళతో కరోన అంతం… రష్యా పరిసోదనల్లో బయటపడ్డ సంచలన విషయాలు

రూ. ౩౩కే కరోనా మందు! భారత్ బయోటెక్ ప్రకటన

తిరుమల కొండల్లో మహాఅద్భుతం..విషయం తెలిసి షాక్ అయిన ప్రజలు

ఆగష్టు 15న దేశ ప్రజలకు మోడీ గిఫ్ట్… ఇక అందరు సేఫ్…

Content above bottom navigation