కరోన వార్డ్ లో పని చేస్తున్న ఈ లేడీ నర్స్ మాటలు వింటే షాక్

ఇదే చివరి రాత్రి కావొచ్చు… నా పిల్లలను హృదయానికి గట్టిగా హత్తుకోవడానికి, నా భర్తకు గుడ్‌నైట్‌ చెప్పి ముద్దుపెట్టడానికి. మళ్లీ ఎప్పుడో ఆ దేవుడికే తెలియాలి. మా ఏరియాలో ‘కరోనా’ కమ్యూనిటీ స్ర్పెడ్‌ అయిందని ప్రకటించారు. ‘ఎమర్జెన్సీ రూమ్‌’ నర్స్‌గా పరిస్థితిని నేను 100 శాతం అంచనా వేయగలను. అందుకే నేను మీకు చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే… మీరంతా మీ కుటుంబంతో ఇంటికే పరిమితం అవ్వండి. బోర్‌ అవుతున్నానని అనుకోవడం, బయట తిరగాలనుకోవడం అస్సలు చేయకండి. ఈ క్లిష్ట సమయంలో మిగతావారికి లేనివి (సంతోషాలు, సౌకర్యాలు) మీకు ఉన్నందుకు గొప్పగా ఫీలవ్వండి. 

రేపటి నా షిఫ్ట్‌ విషయానికొస్తే… ఆసుపత్రిలో నా డ్యూటీ పూర్తికాగానే నేను మా ఇంటి వెనుక నుంచి బయటకు వెళ్లే మార్గమైనా లాండ్రీ రూమ్‌ గుమ్మం నుంచి ఇంట్లోకి వస్తాను. నా ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా, షూతో సహా నేను వేసుకునే దుస్తులను అన్నింటిని శానిటైజ్‌ మోడ్‌లో ఉన్న వాషింగ్‌ మెషీన్‌లో వేస్తాను. నేను ముట్టుకున్న ప్రతీ దాన్ని ‘కలరాక్స్‌ వైప్‌’ (బ్యాక్టీరియాను పోగొట్టే న్యాప్‌కిన్స్‌)తో శుభ్రం చేసుకుంటాను. అప్పటికే నా భర్త నా కోసం ఉంచిన టవల్‌ను కట్టుకుని మా బెడ్‌రూమ్‌లోకి వెళ్తాను. ఈ రోజు నుంచి అక్కడి బాత్‌రూమ్‌లోకి ఇంట్లోవాళ్లకు ప్రవేశం ఉండదు. అక్కడే వేడినీళ్లతో స్నానం చేసి, నేను ముట్టుకున్న ప్రతీ అవయవాన్ని శానిటైజ్‌ చేసుకుని, ఆ తర్వాత చేతులను కూడా శుభ్రంగా కడుక్కుని డ్రెస్‌ వేసుకుంటా.

ఈ క్రమంలోనే ఫ్యామిలీ రూమ్‌లో నేను అమితంగా ప్రేమించే నా వాళ్లకు ఆరు అడుగుల దూరంలో కూర్చుంటాను. ఎవరినీ కనీసం ముట్టుకోను కూడా. డ్యూటీలో ఉన్నప్పుడు షిఫ్ట్‌ ముగిసేదాకా ఒకే మాస్క్‌ను ముఖానికి తగిలించుకుంటాను కాబట్టి, నా శ్వాసకు సంబంధించిన సేఫ్టీ ఉండకపోవచ్చు. దాంతో నేను కూడా వైరస్‌కు వాహకంగా మారొచ్చు. అందుకే నా భర్తతో, పిల్లలతో సేఫ్‌ డిస్టెన్స్‌లోనే మాట్లాడతా. అంతేగానీ వాళ్లను ముట్టుకునే ప్రయత్నం మాత్రం చేయను. నాకు వాళ్లను గుండెకు హత్తుకోవాలని ఉంటుంది కానీ ఆ పని చేయలేను. రానున్న కొన్ని వారాల్లో ఆ ఛాన్స్‌ నాకు రావాలని ఆశ పడుతున్నా. 

నాకు ఆకలి అయితే, అప్పటికే నా కోసం డిన్నర్‌ టేబుల్‌ మీద ఏదో ఒకటి రెడీ చేసి పెడతారు కాబట్టి దానితో సమస్య లేదు. అయితే మా వాళ్ల ముఖాలు చూసినప్పుడే బాధ అనిపిస్తుంది. అయితే ‘మీ మమ్మీ సేఫ్‌గానే ఉంటుంద’నే భరోసాను నా చిన్న కొడుక్కి కొన్ని లక్షలసార్లు ఇస్తుంటాను. నేను ఆ భరోసాను నిలుపుకోగలగాలి. నా పిల్లలకు గాలిలోనే హగ్‌లు ఇచ్చి ‘గుడ్‌నైట్‌’ చెబుతాను. నేను మాత్రం వేరే గదిలో ఒంటరిగా నిద్రపోతాను. 

ఇదీ ప్రతిరోజూ నా జీవితం. నాలో కరోనా జాడలు కనిపించనంత వరకు నా దినచర్య ఇలాగే కొనసాగుతుంది. డ్యూటీలో నా సహచరులను కౌగిలించుకుంటానేమోగానీ, నాకు ఇష్టమైన… ప్రియమైన వారి ప్రేమతో కూడిన మానవస్పర్శను మాత్రం మిస్‌ అవుతూనే ఉంటా. అలా కొన్ని వారాలా… నెలలా… అనేది ప్రజల చేతుల్లో ఉంది.

నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. మీ పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఇంట్లోనే కూర్చుని మీకు ఇష్టమైన సినిమాలు, కార్యక్రమాలు టీవీలో చూస్తూ కాలక్షేపం చేయండి. ఏదైనా అత్యవసరం ఉంటేనే బయటకు వెళ్లండి. మీ పిల్లలను ప్రేమగా హత్తుకోండి. మీ జీవిత భాగస్వామితో కలిసి హాయిగా నిద్రపోండి. మేము చేయలేని పనులను మీరు చేస్తున్నందుకు థ్యాంక్స్‌ చెప్పండి. నేను నా వంతు విధిని నిర్వహిస్తున్నా. మీవంతు బాధ్యతను మీరు నిర్వర్తించండి. 

Content above bottom navigation