Tuesday, July 27, 2021

కొబ్బరిపాలతో అటుకుల పులిహోర తయారీ విధానం

Must Read

ఆంధ్రాలో ఒక ప్రత్యేకమై మాసాలతో పాటు ఎండు మిర్చి పౌడరు, ఎండు మిర్చిని కూడా కూరల్లో వంటలో ఉపయోగిస్తూ.. స్పెషల్ టెస్టు తెస్తారు వంటలకు. దక్షిణాది లో ఆంధ్రా వంటలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. స్వీట్, హాట్,స్పైసీ ఇలా డిఫరెంట్ గా ఉండడంతో.. ఆంధ్ర వంటలకు ఇతర రాష్ట్రాలవారు కూడా ఫిదా. పులిహోర అందరికీ తెలిసిన వంటకమే.. అయితే అటుకులతో కూడా డిఫరెంట్ వంటలకు తయారి చేసుకోవచ్చు. ఈరోజు కొబ్బరిపాలతో అటుకుల పులిహోర తయారీ విధానం తెలుసుకుందాం.

కావాల్సిన పదార్థాలు:
అటుకులు – 2 కప్పులు
కొబ్బరి పాలు- 1 కప్పు
నిమ్మకాయ – 1
జీడిపప్పు (ఇష్టమైనవారు వేసుకోవచ్చు )
వేరుసెనగలు -3 చెంచాలు
కరివేపాకు- నాలుగు రెబ్బలు
నూనె- 4 చెంచాలు
పచ్చిమిర్చి – 2
ఉప్పు- తగినంత
ఉల్లిపాయ – 1

పోపుదినుసులు:
ఆవాలు
మినపప్పు
శనగపప్పు
ఎండుమిర్చి

తయారుచేసే విధానం
కొబ్బరిపాలలో అటుకుల్ని పది నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత బాణలిని స్టౌ మీద పెట్టి వేడి ఎక్కిన తర్వాత నూనె పోసి నూనె కాగిన తర్వాత పోపుదినుసులు శనగపప్పు, మినపప్పు, ఎండుమిర్చి ఆవాలు వేసి.. తర్వాత పచ్చి మిర్చి, కరివేపాకు, వేరుసెనగలు, వేసి వేయించాలి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి మగ్గించాలి. అనంతరం కొబ్బరిపాలల్లో నానబెట్టిన అటుకులు వేసి.. తగినంత ఉప్పు చేర్చి కలియతిప్పి దింపేయాలి. వేరే పళ్ళెంలోకి నిమ్మరసం పిండి చల్లారిన అటుకుల మిశ్రమాన్ని వేసి కలుపుకోవాలి. రుచికరమైన అటుకుల పులిహోర రెడీ.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This