Friday, July 30, 2021

జ‌పాన్‌లో వింతైన విధానం… ఏళ్ల‌కు ఏళ్లు ఇంటికే ప‌రిమితం…

Must Read

పాండ‌మిక్‌, క్వారంటైన్‌, ఐపోలేష‌న్ ఇలా ర‌క‌ర‌కాల పేర్ల‌ను వింటున్నాం. క‌రోనా వైర‌స్ మ‌హ‌మ్మారిగా వచ్చిన త‌రువాత మ‌నం ఈ పేర్లు వింటున్నాం. అయితే, ఐసోలేష‌న్ అనే పేరు జ‌పాన్‌లో ఎప్ప‌టి నుంచే వాడుక‌లో ఉన్న‌ది. అక్కడ ఒక క‌ల్చ‌ర్ ఇప్ప‌టికీ అమ‌లు చేస్తున్నారు. అదే హికికోమోరి విధానం. దీని అర్ధం స‌మాజానికి దూరంగా ఇంట్లోనే గ‌డ‌ప‌డం. అదీ నెల రెండు నెల‌లు కాదు…సంవ‌త్స‌రాల త‌ర‌బ‌డి ఇంటికే పరిమితం అవుతుంటారు.

ఇలాంటివారు ఇళ్లు వ‌దిలి బ‌య‌ట‌కు వెళ్లాలి అంటే అవ‌మానంగా భావిస్తార‌ట‌. ఇంటి నుంచే వివిధ‌ర‌కాల పనులు చేసుకుంటూ, కావాల్సిన వాటిని ఆన్‌లైన్ లో తెప్పించుకుంటూ జీవ‌నం సాగిస్తుంటారు. త‌ప్ప‌నిస‌రి పరిస్థితుల్లో బయటికి వెళ్లాల్సి వ‌స్తే … ప‌ని చూసుకొని వెంట‌నే తిరిగి వ‌స్తార‌ట‌. జ‌పాన్‌లో 5 ల‌క్ష‌ల మందికి పైగా యువ‌త‌, మ‌రో 5 ల‌క్ష‌ల మంది వ‌ర‌కు మ‌ధ్య‌వ‌య‌స్కులు ఈ హికికోమోరి విధానాన్ని అనుస‌రిస్తున్నార‌ని అక్క‌డి గ‌ణాంకాలు చెబుతున్నాయి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This