Tuesday, July 27, 2021

హైవే రేయింలింగ్‌పై నిలిచిన కారు.. వింతైన సంఘటన

Must Read

తాజాగా హిమాచల్ ప్రదేశ్‌లో షాకింగ్ యాక్సీడెంట్ కు సంబంధించి ఫోటో ఒక సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదృష్టావశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమీ కానప్పటికీ.. ఆశ్చర్యకరంగా వారు నడిపిన కారు హైవే రేయిలింగ్‌పైకి ఎక్కి నిలిచిపోయింది. కొంచెం అటు ఇటు అయినా భారీ ప్రమాదమే జరిగి ఉండేదని ఆ ఫోటో చూస్తే చెప్పొచ్చు.

మనం నిత్యం ఎన్నో రోడ్డు ప్రమాదాలను చూస్తుంటాం. కొన్ని ఘోరమైన, భయానకమైన రోడ్డు ప్రమాదాలు సంభవిస్తే.. మరికొన్ని షాకింగ్‌ అనిపించేలా ఉంటాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో ఆల్టో కారు నెర్చోక్ నుంచి ధరంపూర్ వైపు వెళుతోంది. కారులో తండ్రీ, కూతుళ్లు ఉన్నారు.

అయితే, జాబోట్ వంతెన సమీపానికి చేరుకోగానే.. భారీ మలుపు వచ్చింది. ఆ మలపులో అదుపు తప్పిన కారు పల్టీలు కొట్టింది. అలా మూడు అడుగుల ఎత్తైన హైవే రేయిలింగ్‌పే ఎక్కి ఆగిపోయింది. అదృష్టావశాత్తు దానిపై ఆగిపోవడంతో సరిపోయింది. లేదంటే ఆ కారు లోయలో పడి భారీ ప్రమాదమే సంభవించేది. కారు.. రేయిలింగ్‌పై ఆగిపోవడాన్ని గమనించిన కొందరు ప్రయాణికులు కారులో ఉన్న వారిని కాపాడి.. కారును కిందకు దించారు.గతంలోనూ ఇలాంటి ఎన్నో ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెబుతున్నారు. అనేక ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయారని వారు గుర్తు చేశఆరు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This