Tuesday, July 27, 2021

అడవిలోనే 41ఏళ్లుగా.. ఆడవాళ్లంటేనే తెలియని మనిషి

Must Read

Ho Van Lang అనే వియత్నాం దేశానికి చెందిన వ్యక్తి గత 41ఏళ్లుగా అడవిలోనే జీవిస్తున్నాడు. అతడో అసలైన అడవి మనిషి. అతడికి ప్రపంచంతో సంబంధం లేదు. జంతువులతోనే అతడికి సావాసం. అతనికి జీవితంలో ఎక్కువ భాగం మహిళలు కూడా ఉంటారని తెలియదట.. అన్ని ఏళ్లు ఆడవాళ్లు ఉంటారని కూడా తెలియకుండా అడవిలోనే బతికేశాడ. ఇప్పుడు 49 ఏళ్లు ఉంటాయి. Vietnamese అడవిలో దాదాపు 41ఏళ్ల పాటు తన తండ్రి, సోదరుడితోనే జీవించాడు.

తండ్రి Ho Van Thanh.. 1972లో వియత్నాం యుద్ధం (Vietnam War)లో అమెరికా బాంబు దాడిలో తన భార్య, ఇద్దరు పిల్లలను కోల్పోయాడు.. అప్పుడు తన మరో ఇద్దరు పిల్లలను తీసుకుని అడవిలోకి పారిపోయాడు. వారిలో ఒకడే Ho Van Lang.. చిన్నప్పటినుంచి అడవిలోనే పెరగడంతో అడవి మనిషి (Tarzan)గా మారాడు. అడవిలో ఉన్నంతకాలం గత నాలుగు దశాబ్దాలుగా వారి జీవితంలో మరో ఐదుగురిని మాత్రమే చూసి ఉంటారు.

ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న వీరిని ఎనిమిదేళ్ల క్రితమే క్వాంగ్ న్గై ప్రావిన్స్‌లోని టేట్రా జిల్లాలో రక్షించారు. 2015లో కుటుంబాన్ని తిరిగి అల్వారో సెరెజో అనే వ్యక్తి ట్రాక్ చేశారు. మహిళలు నివసించే స్థానిక గ్రామానికి తీసుకువచ్చారు. మహిళల గురించి ఎప్పుడూ కూడా  తన తండ్రి టార్జాన్ లాంగ్‌కు చెప్పలేదు. దూరం నుంచి అక్కడి స్థానికులను చూసినప్పుడుల్లా కనిపించకుండా తప్పించుకునేవాడట.. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే స్త్రీ, పురుషుల మధ్య తేడాను గుర్తించగలిగినప్పటికీ, ఈ రోజు వరకు వారి మధ్య ముఖ్యమైన వ్యత్యాసం ఏంటో అతనికి ఇంకా తెలియదట. ఎన్నడూ కనీస లైంగిక కోరిక కూడా కలగలేదంట..

Docastaway నివేదిక ప్రకారం ఆహారం కోసం వేటాడటంలో ఇతడికి తిరుగులేద. ప్రాథమిక సామాజిక అంశాలను అర్థం చేసుకోలేడు.. ఎందుకంటే తన జీవితమంతా అడవిలో గడిపాడు. ఒక చిన్నపిల్లవాడిలా ఉంటాడని సోదరుడు ట్రై చెప్పుకొచ్చాఅవసరమైన ఆయుదాలను తయారుచేసుకుంటాడు.. వాటితోనే వేటాడి తన ఆహారాన్ని సంపాదించుకుని తినేవాడు.. అతని ఆహారంలో పండు, తేనె, కోతి, పాము, బల్లి, కప్ప ఉంటాయట.. అలాగే అతడికి ఎలుకలో ఇష్టమైన భాగం తల అని చెప్పారు.

జీవితంలో మంచి, చెడు ఏంటో కూడా తెలియదట.. చిన్నప్పటి నుంచి అడవిలో జంతువులతో చెలిమి చేసిన అతడు నెమ్మదిగా జనజీవనానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్నాడు.. కానీ, సాధారణ జీవితంలోకి వచ్చినా అతడి తండ్రిలో భయం అలానే ఉందట.ఇప్పటికీ వియత్నాం యుద్ధం ముగిసిందని అతడు నమ్మడం లేదు. ఆ భయంతోనే ఏదో ఒక రోజు అడవికి తిరిగి వెళ్లిపోవాలని భావిస్తున్నాడు. 
Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This