Friday, July 30, 2021

తాడేపల్లిల్లో అత్యాచార నిందితుడు…రైల్వే ట్రాక్‌పై నివాసం

Must Read

యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన కేసులో ఓ నిందితుడు బుధవారం తాడేపల్లి రైల్వే వంతెనపై ప్రత్యక్షమయ్యాడు. ఆ వ్యక్తి గతంలో గుంటూరు జిల్లా తాడేపల్లి దగ్గరలో సీతానగరం పుష్కరఘాట్ వద్ద అత్యాచారం చేశాడు.

   తాడేపల్లి అత్యాచార ఘటనలో రాష్ట్రవ్యాప్తంగా సంచలం సృష్టించిన ప్రధాన నిందితుడు పోలీసులను ముప్పతిప్పలు పెడుతున్నాడు. తాడేపల్లి రైల్వే ట్రాక్‌ వద్ద బుధవారం నిందితుడు కనిపించడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో నిందితుడు గూడ్స్‌ రైలు ఎక్కి పరారైనట్లు స్థానికులు పోలీసులకు తెలిపారు. నిందితుడి కోసం పోలీసులు రైల్వే ప్రాంతాల్లో విస్తృతంగా గాలింపు చేపట్టారు.

   తాడేపల్లి రైల్వే వంతెనను నివాసంగా ఏర్పాటు చేసుకుని  నిందితుడు కొన్ని రోజులగా ఉంటున్నట్లు సమాచారం. గత నాలుగు రోజులుగా నిందితుడు పోలీసుల దొరకకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అతడిని పట్టుకునేందుకు ఎన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నా త్రుటిలో తప్పించుకుంటూ ముప్పుతిప్పలు పెడుతున్నాడు.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరం పుష్కరఘాట్‌ వద్ద యువతిపై అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ నెల 19న కాబోయే భర్తతో నదీ తీరానికి వచ్చిన యువతి అత్యాచారానికి గురైయింది. ఆమెపై అఘాయిత్యం చేసిన నిందితులు కాబోయే భర్త కాళ్లు చేతులు కట్టేసిన కామాంధులు అరిస్తే చంపేస్తామని బెదిరించారు. నిందితులు బాధితురాలి వద్ద ఉన్న సెల్‌ఫోన్‌, చెవి దిద్దులు లాక్కెల్లారు. ఈ ఘటన సీఎం ఇంటికి కిలోమీటరున్నర దూరంలోనే జరిగింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This