Tuesday, July 27, 2021

భార్య మిస్సింగ్ పెళ్లయిన 3 వారాలకే….ఛాటింగ్‌తో గుట్టురట్టు

Must Read
హైదరాబాద్ నగరంలోని నల్లకుంట పీఎస్‌ పరిధిలో వివాహమైన మూడు వారాలకే ఓ నవ వధువు అదృశ్యమైన సంఘటన జరిగింది. తన భార్య మిస్సింగ్ వెెనుక ఓ యువకుడి హస్తం ఉందని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివాహమైన మూడు వారాలకే ఓ యువతి తన భర్తకు మోసం చేసింది. భర్త ఆఫీసుకు వెళ్లగానే అన్నీ సర్దుకుని ప్రియుడితో వెళ్లిపోయింది. నల్లకుంట పీఎస్‌ పరిధిలోని అడిక్‌మెట్‌ బాలాజీనగర్‌లో నివాసముండే బుగుడుల సాయికుమార్‌కు సిద్దిపేట జిల్లా తోగుట గ్రామానికి చెందిన సీహెచ్‌.అంజయ్య కుమార్తె నాగరాణి (20)తో మే 30న వివాహం జరిగింది.మంగళవారం ఉదయం సాయికుమార్‌ రోజూ మాదిరిగానే ఆఫీసుకు వెళ్లాడు.

మధ్యాహ్నం సమయంలో వదిన రేణుక సాయికుమార్‌కు ఫోన్ చేసి నీ భార్య కనిపించడం లేదని చెప్పింది. దీంతో అతడు కంగారుగా ఇంటికొచ్చి వెతకగా.. బీరువాలోని ఆమె బట్టలు, నగలు కనిపించలేదు. పుట్టింటికి వెళ్లిపోయిందన్న అనుమానంతో అక్కడికి ఫోన్ చేయగా తమ వద్దకు రాలేదని చెప్పారు. అయితే బీరువాలో నాగరాణి సెల్‌ఫోన్ గమనించిన సాయికుమార్‌ దాన్ని పరిశీలించగా మరో యువకుడితో చేసిన ఛాటింగ్ బయటపడింది.

దీంతో తన భార్య కనిపించడం లేదంటూ సాయికుమార్ నల్లకుంట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకున్న పోలీసులు నాగరాణి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. అయితే పెళ్లికి ముందే తన భార్యను ఓ యువకుడి తీసుకుపోయాడని, ఇప్పుడు కూడా అతడి హస్తం ఉండొచ్చని సాయికుమార్ తన ఫిర్యాదులో పేర్కొన్నాడు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This