Tuesday, July 27, 2021

రోజుకి ఎన్ని సిగరెట్లు రష్మిక? హీరోయిన్ కి ప్రశ్న వేసిన అభిమాని…

Must Read

రష్మిక మందన్న ఎంతోమంది అభిమానులను అనతికాలంలోనే సంపాదించుకుంది. ఆమె ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో బిజీ హీరోయిన్ గా మారింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ బ్యూటీకి తాజాగా ఓ నెటిజన్ నుంచి షాకింగ్ ప్రశ్న ఎదురైంది. ఈ నటిని ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక అభిమాని “మీరు రోజులో ఎన్ని సిగరెట్లు తాగుతారు?” అని ప్రశ్నించాడు. దానికి స్పందించిన ఆమె ఎప్పుడూ సిగరెట్లు తాగలేదని, సిగరెట్లు తాగేవారు అన్నా తనకు ఇష్టం ఉండరని కూల్ గా రిప్లై ఇచ్చింది.

కొంతమంది అభిమానులు అల్లు అర్జున్ గురించి చెప్పమని ప్రశ్నించగా ఆయన అద్భుతమైన నటుడని, అతనితో కలిసి పని చేయడం సంతోషంగా ఉందని వెల్లడించింది. త్వరలో ఓ ప్రాజెక్ట్ లో విజయ్ తో కలిసి పని చేయాలన్న కోరికను రష్మిక వ్యక్తం చేసింది. ఇక రష్మిక హిందీలో సిధార్థ్ మల్హోత్రా సరసన ‘మిషన్ మజ్ను’, అమితాబ్ బచ్చన్, నీనా గుప్తా నటిస్తున్న ‘గుడ్ బై’ చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో ‘పుష్ప’, ‘ఆడవాళ్ళూ మీకు జోహార్లు’ చిత్రాలలో నటిస్తోంది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This