Friday, July 30, 2021

భారతదేశంలో ఈ రోజు కరోనా కేసులు ఎన్ని అంటే?

Must Read

మన దేశంలో క‌రోనా కేసులు క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. అయినప్పటికీ ప్రజలు జాగ్రత్తలు పాటించవలసిన అవసరం ఉంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా క‌రోనా బులిటెన్‌ను విడుద‌ల చేసింది. ఈ బులిటెన్ ప్రకారం, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో 34,703 క‌రోనా కేసులు న‌మోద‌య్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వ‌ర‌కు న‌మోదైన మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 3,06,19,932 కి చేరింది. ఇందులో 2,97,52,294 మంది కోలుకొని డిశ్చార్జ్‌కాగా, 4,64,357 కేసులు యాక్టీవ్‌గా ఉన్నాయి.

కేసులు క్రమక్రమంగా తగ్గడమే కాకుండా మృతులు సంఖ్య కూడా తగ్గడంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక‌, గ‌డిచిన 24 గంట‌ల్లో ఇండియాలో క‌రోనాతో 553 మంది మృతి చెందారు. దేశంలో ఇప్పటి వ‌ర‌కు మొత్తం 4,03,281 మంది క‌రోనాతో మృతి చెందారు. ఒక్క రోజులో దేశంలో 51,864 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This