Tuesday, July 27, 2021

జ‌ల‌పాతం కింద వంద‌లాది మంది స్నానం….కరోనా ?

Must Read

క‌రోనా సెకండ్ వేవ్ నుంచి దేశం ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేదు. కేసులు త‌గ్గుముఖం ప‌డుతుండ‌టంతో అన్ని రంగాల‌కు అనుమ‌తులు ఇచ్చారు. దేశంలోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్రాలు తిరిగి తెరుచుకోవ‌డంతో టూరిస్టుల తాకిడి పెరిగింది. పర్యాటక ప్రాంతాల్లో టూరిస్టుల పర్యటనలు మళ్లి మొదలవడంతో కరోనా కేసులు పెరుగుతాయని భయాందోళనులు నెలకున్నయ్. ఉత్త‌రాఖండ్‌లోని ప్ర‌ముఖ ప‌ర్యాట‌క కేంద్ర‌మైని ముస్సోరిలోని కెంప్టీ జ‌ల‌పాతాన్ని సంద‌ర్శించేందుకు భారీగా త‌ర‌లి వ‌చ్చారు. కెంప్టీ జ‌ల‌పాతం కింద ప‌ర్యాట‌కు పోటీలుప‌డి మ‌రీ స్నానాలు చేశారు.

చాల ఎక్కువ మంది సామాజిక దూరం పాటించ‌కుండా జ‌ల‌పాతం కింద‌కు చేరి ఎంజాయ్ చేశారు. మాములూ స‌మ‌యాల్లో అయితే నెటిజ‌న్లు అంత‌గా రియాక్ట్ అయ్యేవారు కాదు. క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఎలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కోన్నామో అంద‌రికి తెలుసు కాబ‌ట్టి నెటిజ‌న్లు తీవ్రంగా స్పందించారు. క‌రోనా నిబంధ‌న‌లు గాలికి వ‌దిలేయ‌డం త‌గ‌ద‌ని, క‌రోనా థ‌ర్డ్ వేవ్ ముప్పు ప్ర‌మాదం దృష్ట్యా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని నెటిజ‌న్లు సూచిస్తున్నారు. ఎంప్టీ బ్రెయిన్స్ ఎట్ కెంప్టీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. కెంప్టీ జ‌ల‌పాతానికి సంబందించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This