Tuesday, July 27, 2021

అక్రమంగా బంగ్లాదేశ్ యువకులు ఏపిలో ప్రవేశం

Must Read

గతంలో ఎక్కువగా పశ్చిమ బెంగాల్లో ప్రవేశించిన బాంగ్లాదేశ్ వ్యక్తులు ఇప్పుడు ఏపీలో కూడా ప్రవేశిస్తున్నారు. భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన నలుగురు బంగ్లాదేశ్‌కు చెందిన యువకులను అరెస్ట్ చేశారు విజయవాడ పోలీసులు.. పోలీసుల విచారణలో తుల్లానా జిల్లా నుండి భారత్‌లోకి ప్రవేశించినట్టుగా తెలిపారు. ఆ తర్వాత హావ్ డా – వాస్కోడిగామా రైలులో వెళ్తుండగా బెజవాడలో అదుపులోకి తీసుకున్నారు రైల్వే పోలీసులు.. పాస్ పోర్ట్ లేకుండా నల్లాల ద్వారా భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించినట్టు గుర్తించారు. దర్బంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు.

దర్బంగా ఘటనతో అప్రమత్తమైన పోలీసులు..అసలు ఆ యువకులు ఏపీలోకి రావడానికి గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేపట్టారు.. అయితే, ఉపాధి కోసమే భారత్‌లోకి అక్రమంగా వచ్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలినట్టుగా తెలుస్తోంది.. వీరితోపాటు మరికొందరు బంగ్లాదేశీయులు భారత్ కి ప్రవేశించినట్లుగా నిర్ధారణకు వచ్చారు. పలు రాష్ట్రాల్లో అక్రమంగా చొరబడి నివాసాలు ఏర్పాటు చేస్తుకునట్టు గుర్తించారు. నిందితుల నుండి నకిలీ పాన్, ఆధార్ పత్రాలు స్వాధీనం చేసుకున్న పోలీసులు…అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. భారత్‌లో అక్రమ చొరబాట్లు ఎప్పటి నుంచో జరుగుతున్నా… తాజా పరిణామాలతో మరింత అలర్ట్ అయ్యారు పోలీసులు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This