Tuesday, July 27, 2021

విశాఖపట్నంలో మద్యం మత్తులో స్నేహితుడి హత్య

Must Read

యువత మద్యానికి బానిస అవ్వడమే కాకుండా ఆ మత్తులో నేరాలకు పాల్పడడం మనం చూస్తుంటాం. మరి అలాంటి సంఘటనే విశాఖపట్నంలో చోటు చేసుకుంది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య ఘర్షణ లో ఓ సివిల్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. విశాఖ బీచ్ రోడ్ లోని ఓ అపార్ట్ మెంట్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి కి చెందిన గోపాలకృష్ణ (26)గా గుర్తించారు.

విశాఖపట్టణం నగరంలోని ఓ రియల్ కంపెనీలో సివిల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాడు గోపాలకృష్ణ. అయితే మద్యం మత్తులో మాటా మాట పెరిగి గొడవకు దిగ్గారు స్నేహితులు. దాంతో గోపాలకృష్ణను కత్తితో పొడిచి గాయపరిచాడు బ్రహ్మాజీ అనే వ్యక్తి. అతడిని వెంటనే కేజీహెచ్ కు తరలించారు స్నేహితులు. కానీ చికిత్స పొందుతు మృతి చెందాడు గోపాలకృష్ణ. ప్రస్తుతం నిందితుడు పరారిలో ఉండగా పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This