Friday, July 30, 2021

మరోసారి దేశంలో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు

Must Read

బంగారం చాలా విలువైన వస్తువు. బంగారం కొనడంలో మన దేశం ఎప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ముఖ్యంగా మహిళలు మన దేశంలో బంగారాన్ని బాగా ఇష్టపడతారు. అయితే.. గత వారం రోజుల నుంచి బంగారం ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇవాళ మరోసారి బంగారం ధ‌ర‌లు భారీగా పెరిగాయి. దీంతో మహిళలు కొనడానికి భయపడుతున్నారు.

హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో ధ‌ర‌లు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 90 పెరిగి రూ.44,400కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ. 100 పెరిగి 48,440 కి చేరింది. గ‌త వారం రోజులుగా బంగారం ధ‌ర‌లు పెరుగుతుండ‌టంతో బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగ‌దారులు ఆలోచిస్తున్నారు. అంత‌ర్జాతీయ మార్కెట్లో బంగారం ధ‌ర‌లు తగ్గుముఖం ప‌ట్టినా, దేశీయంగా ధ‌ర‌లు పెర‌గ‌డం విశేషం. బంగారం ధరలు పెరిగితే వెండి ధరలు మాత్రం తగ్గాయి. కిలో వెండి ధర రూ. 200 పెరిగి రూ.75,200 కి చేరింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This