Friday, July 30, 2021

క‌రోనా మహమ్మారి నుంచి ప్రజలు స్వేచ్ఛాకాలం దిశ‌గా…

Must Read

క‌రోనా నుంచి బ‌య‌ట‌ప‌డేందుకు బ్రిటన్ లో అత్యధిక కాలం లాక్‌డౌన్ ను అమలు చేశారు. జులై 19 తరువాత ఆంక్షలను ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. మాస్క్ వాడకం విషయంపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంద‌ని నిపుణులు చెబుతున్నారు. క‌రోనా మహమ్మారి నుంచి యావత్ ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌ప‌డుతున్నాయి. వ్యాక్సినేషన్ ప్రక్రియను, నిబంధ‌న‌ల‌ను ప‌క్కాగా అమలు చేయడం వలనే క‌రోనా ర‌క్క‌సి కోర‌ల నుంచి దేశాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి.

కరోనా ఆంక్షలు నుంచి ప్రజలు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు. వేగంగా అమలు చేస్తున్న వ్యాక్సిన్ విధానం స‌త్ఫ‌లితాలు ఇస్తుండటంతో, మాస్క్ వాడాలా, వద్దా అనేది ప్రజల ఇష్టానికి వదిలేయాలని అక్కడి ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఏడాదిన్నర కాలంగా ఆంక్షలతో మ‌గ్గిపోయిన ప్రజలు స్వేచ్ఛ‌ను కోరుకుంటున్నారని, వారి ఆలోచ‌న‌ల‌కు అనుగుణంగానే ప్ర‌భుత్వం నిర్ణ‌యాలు తీసుకునే అవకాశం ఉందని బ్రిటన్ గృహనిర్మాణ శాఖ మంత్రి పేర్కొన్నారు. భౌతిక దూరం పాటించడంతో పాటుగా పలు రకాల నిబంధనలు ఎత్తివేసే యోచనలో బ్రిటన్ ప్రధాని ఉన్నట్లుగా సండే టైమ్స్ తెలిపింది.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This