Friday, July 30, 2021

వరుడు అరెస్ట్…. అక్కాచెల్లెళ్లను ఇద్దరిని ఒకేసారి…?

Must Read

ఉమాపతి అనే వ్యక్తి ఒకేసారి మండపంలో ఇద్దరు అక్కచెల్లళ్ళను పెళ్లి చేసుకున్నాడు. ఈ విష‌యం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ కావ‌డంతో పోలీసుల దాకా చేరింది. అందులో ఒకరు మైనర్ బాలిక అవ్వడంతో పోలీసులు వరుడిని అరెస్ట్ చేసిన ఘటన కర్ణాటకలో జరిగింది.

కర్ణాటకలోని కోలార్​లో అక్కాచెల్లెళ్లిద్దరినీ పెళ్లి చేసుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్​ చేశారు. వరుడు ఉమాపతితో సహా.. మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు. 31 ఏండ్ల ఉమాపతి.. మూగ, వినికిడి సమస్యలతో బాధపడుతున్న ఇద్దరు అక్కాచెల్లెళ్లను (సుప్రియ, లలిత) వివాహమాడాడు. తన కూతుళ్లకు వేరుగా పెళ్లి చేస్తే.. ఇబ్బందులను ఎదుర్కొంటారని భావించిన తండ్రి.. వయసు గురించి ఆలోచించకుండా ఇరువురికీ ఒకే వరుడినిచ్చి కట్టబెట్టాడు. సుప్రియ సోద‌రి వ‌య‌సు 16 ఏండ్లు కావ‌డంతో.. పెళ్లి చేసుకున్న యువ‌కుడితో పాటు అత‌ని కుటుంబ స‌భ్యుల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. నూత‌న వ‌రుడు ఉమాప‌తిని పోలీసులు అరెస్టు చేశారు.
Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This