Tuesday, July 27, 2021

ఎండ్రకాయను రౌండప్ చేసిన సింహాలు.. ఆ తర్వాత ఏం జరిగిందంటే

Must Read

సింహం వేట అంటేనే మాములుగా ఉండదు. కానీ ఇక్కడ ఎండ్రకాయ సింహాల నుంచి తన ప్రాణాన్ని రక్షించుకుంది. ఇతర జంతువులు ఏవైనా కూడా సింహం కంట పడ్డాయంటే వాటికి చావు తప్పదు. సరైన వ్యూహం పన్ని ఎలాంటి జంతువునైనా మట్టి కరిపిస్తుంది. ఇలా ఒక్క సింహం దాడి చేస్తేనే ఇంతటి బీభత్సం ఉంటే.. ఒకేసారి గుంపుగా ఐదు సింహాలు దాడి చేస్తే.. ఇంకేమైనా ఉందా.! ఊహించుకోవడానికే భయంగా ఉంది కదూ.! కానీ ఇక్కడ అలాంటి సీన్ ఒకటి జరిగింది.

ఒక ఎండ్రకాయను ఏకంగా ఐదు సింహాలు రౌండప్ చేశాయి. సింగిల్‌గా ఉన్న దాన్ని ఐదు సింహాలు చుట్టుముట్టినా.. ఏమాత్రం భయపడలేదు. అసలు ఇంతకీ ఆ ఎండ్రికాయను సింహాలు ఏం చెయ్యాలనుకున్నాయో తెలుసుకునేలోపే వీడియో కాస్తా పూర్తవుతుంది. ఈ అద్భుత దృశ్యాలను రేంజర్స్‌ రగ్గిరో బారెటో, రాబిన్ సెవెల్ అనే ఇద్దరు ఫోటోగ్రాఫర్‌లు తమ కెమెరాల్లో బంధించగా.. అనూహ్యంగా అప్‌లోడ్‌ చేసిన కొద్దిసేపటికే నెట్టింట్లో వైరల్‌గా మారింది.

మొదటిగా ఎండ్రకాయ ఇసుకలో నుంచి పైకి రాగానే.. అక్కడే ఉన్న ఓ సింహం దాన్ని పరిశీలనగా చూస్తుంది. దానినే ఫాలో అవుతూ.. కదలికలను పరిశీలిస్తుంది. ఇక కొద్దిసేపటికి మరో నాలుగు సింహాలు కూడా చేరి దాని వెనుక పడతాయి. అయితే తనను ఐదు సింహాలు రౌండప్ చేసిన విషయాన్ని అస్సలు పట్టించుకోని ఆ ఎండ్రకాయ తన దారిన తాను వెళ్లిపోతుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దానిపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పటిదాకా సుమారు 84 వేల వ్యూస్ వచ్చాయి. లేట్ ఎందుకు మీరు కూడా ఓ లుక్కేయండి.!

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This