Friday, July 30, 2021

విజయవాడ ఎయిర్‌పోర్ట్‌లో భారీ రన్‌వే.. ఇకపై అంతర్జాతీయ విమానాలు ల్యాండింగ్‌

Must Read

విజయవాడలో భారీ రన్ వే విస్తరణ పనులు వేగంగా జరుగుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో విజయవాడ ఎయిర్ పోర్ట్ రూపుదిద్దుకోనుంది. భారీ బోయింగ్ విమానాలు ల్యాండింగ్‌కు అవసరమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

విజయవాడ విమానాశ్రయానికి మహర్దశ పట్టనుంది. బెజవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిర్మించిన నూతన రన్‌వే జూలై 15న అందుబాటులోకి రానుంది. రాష్ట్రంలోని అతిపెద్ద రన్‌వే కలిగిన ఎయిర్‌పోర్టుగా ఈ విమానాశ్రయం నిలవనుంది. రన్‌వే పొడవు 3,523 అడుగులు. ఇంతకుముందు ఇక్కడ రన్‌వే పొడవు 7,500 అడుగులుగా ఉండేది. కొత్తది అందుబాటులోకి వస్తే రన్‌వే పొడవు 11,023 అడుగులకు పెరుగుతుంది.

ఈ రన్‌వే పనులు రెండున్నరేళ్ల కిందటే పూర్తయ్యాయి. అయితే విమానాశ్రయ రైతుల భూ సమస్యలు తేలకపోవటం, చుట్టూ సెక్యూరిటీ లేకపోవటం వంటి కారణాలతో డీజీసీఏ అనుమతులు రాలేదు. ఈ సమస్యలు ఇంకా తీరనప్పటికీ డీజీసీఏ ఏడాది కిందట వర్చువల్‌గా తనిఖీలు చేసింది. విమానాశ్రయ అధికారులు నిర్వహించిన ఫ్రిక్షన్‌ టెస్ట్‌ కూడా విజయవంతంగా ముగిసింది.

నూతన రన్‌వే అందుబాటులోకి రానుండటంతో విజయవాడ ఎయిర్‌పోర్టు ఇకపై భారీ అంతర్జాతీయ విమానాలు కూడా ల్యాండింగ్‌, టేకాఫ్‌ అయ్యే వీలు కలుగుతుంది. ఈ రన్‌వేని జూలై 15నుంచి వినియోగంలోకి తీసుకురావచ్చని డీజీసీఏ నిర్దేశించింది. 
Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This