Tuesday, July 27, 2021

చైనా వల్ల మూడో ప్రపంచ యుద్ధం వస్తుందా?

Must Read

చైనా తన పొరుగున ఉన్న దేశాలతో ఎప్పుడు గొడవ పెట్టుకోవడం సహజమే. చైనా ప్ర‌తి దేశంలో క‌య్యానికి కాలు దువ్వుతున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా మ‌హ‌మ్మారి అప‌వాదును తొల‌గించుకునేందుకు, ఆ విష‌యాల‌ను ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు చైనా ఈ విధంగా ప్ర‌వ‌ర్తిస్తున్న‌ట్టు నిపుణులు చెబుతున్నారు. స‌రిహ‌ద్దుల్లో ఉన్న‌దేశాల‌తో నిత్యం పేచీ పెట్టుకుంటున్న డ్రాగ‌న్, తైవాన్ విష‌యంలో చేసిన వ్యాఖ్య‌లు అంత‌ర్జాతీంగా టెన్ష‌న్ పెడుతున్నాయి. ఇప్ప‌టికే హాంకాంగ్ ను త‌న గుప్పిట్లో పెట్టుకున్న చైనా, తైవాన్ దేశాన్ని కూడా త‌న ఆదీనంలోకి తీసుకుంటాన‌ని అంటోంది. టిబెట్ విష‌యంలో కూడా ఇదే దూకుడును ప్ర‌ద‌ర్శించి ఆ దేశాన్ని త‌న గుప్పిట్లో పెట్టుకున్న‌ది.

చైనా భవిష్యత్తులో సామ్రాజ్య‌వాద, విస్త‌ర‌ణ ధోర‌ణితో ఉంటూ తైవాన్ విష‌యంలో అనుకున్న విధంగా ప్లాన్‌ను అమ‌లుచేసి ఆక్ర‌మించుకుంటే, ప్ర‌పంచంలో ప‌రిణామాలు ఒక్క‌సారిగా మారిపోయో అవ‌కాశం ఉంటుంది. మొద‌టి నుంచి అమెరికా తైవాన్‌కు మ‌ద్ద‌తూ ఇస్తూ వ‌స్తున్న‌ది. అమెరికాతో పాటు అసియాలోని అనేక దేశాలు కూడా తైవాన్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. ఒకవేళ చైనా తైవాన్‌ను సొంతం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తే చైనా వ్య‌తిరేక దేశాల‌న్నికూడా ఒక్క‌ట‌య్యే అవ‌కాశం లేక‌పోలేదు. రెండో ప్ర‌పంచ యుద్ధ కాలం నాటి ప‌రిస్థితులు వ‌చ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రంలేదు.

Latest News

బ్యాంకులకు 200 కోట్లు మోసం చేసిన వ్యక్తి అరెస్ట్

దేశవ్యాప్తంగా బ్యాంకులకు 200 కోట్లు టోకరా వేసిన ఒరిస్సాకు చెందిన నిందితుడు అరెస్ట్ అయ్యాడు. మైక్రో ఫైనాన్స్‌ పేరుతో వివిధ బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌...

More Articles Like This